పశు వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పశు వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ పశువైద్యశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. పశువులకు వచ్చే రోగాలకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రోగాల బారిన పడిన పశువులకు చికిత్స అందజేయాలన్నారు.