బాపట్లలో మన వార్డు-మన ఎమ్మెల్యే
బాపట్ల రైలుపేట 4వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ‘మన వార్డు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.