ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్ పర్సన్ రజిత
KMR: ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్ పర్సన్ రజిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.