నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
NLG: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కొండమల్లేపల్లి మండలం, గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ వద్ద కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. సూచనలతో కూడిన బ్యానర్ల ఏర్పాటును పరిశీలించారు.