'సైకిల్ వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది'

PPM: సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా ఆరోగ్యం మరింతగా మెరుగు పడుతుందని కొమరాడ ఎస్సై నీలకంఠం అన్నారు. ఆదివారం కొమరాడ మండల కేంద్రంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు.