VIDEO: పేదల కోసం మరో అన్నా క్యాంటీన్ ప్రారంభం
అన్నమయ్య: రైల్వే కోడూరు–చిట్వేలి రోడ్డులో అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ ప్రారంభించారు. పేదలకు రూ.5కే భోజనం అందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం అనంతరం క్యాంటీన్‌లోనే భోజనం చేసి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ ముక్క రూపానంద రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.