'మే 11 నుంచి జనగణన కార్యక్రమం ప్రారంభం'
ADB: మే 11 నుంచి ప్రారంభం కానున్న జనగణన కార్యక్రమం సందర్భంగా ఎన్యుమేటర్లు, సూపర్వైజర్లను గుర్తించి నియమించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలికేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. నియమితులైన వారి పూర్తి వివరాలను సీఎంఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు.