లోక్‌సభలో 2026 ఆర్థిక బిల్లుకు ఆమోదం
లోక్‌సభలో 2026 ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. కేంద్రం ప్రతిపాదించిన 32 సవరణలతో కూడిన ఈ బిల్లుకు సభ ఆమోదం లభించింది. దిగువ సభలో ఈ బిల్లు పాస్ కావడంతో దీనిని ఎగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా బిల్లుకు ఆమోద ముద్ర పడితే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది.