ప్రమాద కరంగా మారిన వంతెన.. పట్టించుకోని అధికారులు

JGL: బీర్పూర్ మండలం తుంగూరు, కండ్లపల్లి గ్రామాల మధ్యన గల పెద్దవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలకు కోతకు గురై, మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. రంగసాగర్, కండ్లపల్లి గ్రామాలకు చెందినవారు ప్రతిరోజు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనను మరమ్మతు చేయాలని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.