IPL 2026: బుమ్రా స్థానంలో మద్వాల్!
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో ముంబై తొలి మ్యాచ్ నాటికి బుమ్రా అందుబాటులోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో బుమ్రా స్థానంలో ఆకాశ్ మద్వాల్‌కు తుది జట్టులో అవకాశం ఇస్తారని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. 2023, 2024 సీజన్లలో ముంబైకి ఆడిన మద్వాల్.. 13 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టాడు.