14వ వార్డు కౌన్సిలర్‌గా సోమ రజిని
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజిని రాజశేఖర్ తన సమీప BRS, బీజేపీ ప్రత్యర్థులపై గెలుపొందారు. ఆమె గెలుపుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తొర్రూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఏడు వార్డులో భారీ విజయం సాధించింది.