తల్లికి ప్రేమతో' చెరువు కట్టించిన సర్వాయి పాపన్న..!

KNR: కొండల నుంచి వచ్చే నీటిని వృథా కాకుండా సంరక్షించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్‌లో భారీ చెరువులను నిర్మించారు. రేణుక ఎల్లమ్మ పేరిట ఎల్లమ్మ చెరువు, ఆరాధ్య దైవంపై బయన్న చెరువు, తల్లి పేరిట సర్వమ్మ చెరువు వంటి గొలుసుకట్టు చెరువులను కట్టించారు. మైదానబావి, నీటికొలనులు వంటి నీటినిల్వలు కూడా ఆయన ఘనచరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలిపారు.