ఈనెల 23న ప్రపంచ శాంతి కోసం 5కే రన్
HYD: ప్రపంచవ్యాప్తంగా శాంతికోసం ఈనెల 23న 5కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పోస్టర్ ను నిర్వాహకులు శ్రీధర్ యాలాల, మోడల్ మీను సింగ్ ఆవిష్కరించారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఈ రన్‌ను న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రారంభిస్తారన్నారు.