అపోలో యూనివర్శిటీలో స్పోర్ట్స్ & కల్చరల్ డే

అపోలో యూనివర్శిటీలో స్పోర్ట్స్ & కల్చరల్ డే

CTR: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో “స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే–2026” ఉత్సాహంగా జరిగింది. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో విజేతలను సత్కరించారు.