మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షంతో వాహనదారులు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు.