ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ఆటో ఢీ

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ఆటో ఢీ

GNTR: ఫిరంగిపురం మండలం రేపుడి సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.