ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవం

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవం

ASR: కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ నల్లబెల్లి గ్రామానికి చెందిన ముసిరి మీనా (28) అనే నిండు గర్భిణీకి ఇవాళ పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్ వాహనం వెంటనే అక్కడికి చేరుకుని, గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్ మహిళకు ప్రసవం చేశారు.