ప్రకృతి పంటల మేళాలో పాల్గొన్న మంత్రి
VSP: సేంద్రీయ రైతులు రాష్ట్రానికి విలువైన ఆస్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రకృతి పంటల మేళాను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా రైతులకు చేయూతనిచ్చే ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.