'వచ్చే శివరాత్రికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తా'
SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామినీ మంత్రి పొన్నం ప్రభాకర్ శివరాత్రి సందర్భంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ శివుని కృపతో వచ్చే శివరాత్రి నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకి నీరు అందిస్తానని హుస్నాబాద్‌ను మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్తానని మంత్రి అన్నారు.