మామండూరు వద్ద లారీ బోల్తా

మామండూరు వద్ద లారీ బోల్తా

CTR: చంద్రగిరి సమీపంలో గల మామండూరు వద్ద ఇంటీరియర్స్ లారీ బోల్తా కొట్టిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇంటీరియర్స్ సామాన్లు తీసుకు వెళుతున్న లారీ చిత్తూరు నుండి వస్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో హైవే పై ఉన్న కాలువలోకి మళ్లించడంతో లారీ బోల్తా పడిందన్నారు. డ్రైవర్‌కు క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి అని తెలిపారు.