తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీ వ్యాన్ వితరణ
GNTR: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు మృతదేహాలను తరలించేందుకు ఉపయోగపడే మార్చురీ వ్యాన్‌ను హార్వెస్ట్ ఇండియా అధినేత, టీడీపీ నాయకుడు సురేశ్ కుమార్ తన సొంత నిధులతో సమకూర్చారు. బుధవారం MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా, తదితరుల చేతుల మీదుగా వ్యాన్ డాక్యుమెంట్లు, వాహనాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు.