నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై గందరగోళం

NLG: నాగార్జునసాగర్ డ్యాంని వైజాగ్ బెటాలియన్ కు చెందిన కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటివరకు ములుగు బెటాలియన్‌కి చెందిన కేంద్ర బలగాల ఆధీనంలో డ్యాం భద్రత ఉండేది. తాజా పరిణామాలపై KRMB, ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారులు సమాచారం అందించారు. ములుగు బెటాలియన్ కేంద్ర బలగాల ఉపసంహరణ పై డ్యాం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.