తాగునీటి సమస్యతో ప్రజల ఇబ్బందులు
KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం కాలనీలో కొద్ది రోజులుగా నీరు రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని అప్పుడే తాగునీటి సమస్యలు ఏర్పడితే వేసవి కాలంలో తీవ్రతరం అవుతుందంటున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే నీటి కోసం కుళాయిల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.