'భారత మహిళా జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది'

'భారత మహిళా జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది'

మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుస్తుందని మాజీ క్రికెటర్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. టీమిండియా విశ్వవిజేతగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై మన ప్లేయర్లు అద్భుతంగా ఆడారని అభినందించారు. కాగా, ఈరోజు దక్షిణాఫ్రికా జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే.