శివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే గోరంట్ల

E.G: కడియం మండలం, కడియపులంక గ్రామంలోని అపర్ణ సమేత అనంతేశ్వ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిదేవుని ఆశ్శీస్సులు ప్రజలందిరిపైన ఉండాలన్నరు.