విషాదం.. పాము కాటుతో బాలిక మృతి
KKD: జిల్లాలోని జిల్లా కొత్తపేట మండలం కోనపాపపేట గ్రామంలో విషాదకర సంఘటన నెలకొంది. రాత్రి నిద్రిస్తున్న 14 ఏళ్ల చొక్కా దీపికను శుక్రవారం తెల్లవారుజామున మంచం కింద నుంచి దూరిన పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.