'అత్తా కోడళ్లకు షాకిచ్చిన తొర్రూరు ఓటర్లు'
MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అత్తా కోడళ్లకు తొర్రూరు ఓటర్లు షాకిచ్చారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు 9 స్థానాలు గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటింది. కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచింది. దీంతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.