నాసిరకంగా PM జన్ మన్ పథకం ఇండ్లు
ASF: తిర్యాణి మండలం భీంజిగూడ కోలంగూడాలో PM జన్ మన్ పథకం కింద నిర్మించబడుతున్న ఇండ్లలో గుప్తదారు నాసిరకంగా ఇల్లు కడుతున్నారని కోలం గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ సర్పంచ్ దేవింద్ర భాయ్ స్పందించారు. బుధవారం పనులను పరిశీలించి నాసిరకంగా ఉన్నాయంటు మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే గుత్త దారులు రెచ్చిపోతున్నట్టు ఆమె ఆరోపించారు.