మల్లాలమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
TPT: యర్రావారిపాల్యం మండలం నెరబైలు పంచాయతీ పులిబోనుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లాలమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలికగా, అర్చకులు, గ్రామ పెద్దలు పూర్ణకుంభ స్వాగతం అందించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.