పెట్రోల్, డీజిల్ కొరత.. భారీగా క్యూ లైన్
AP: కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తింది. అనేకచోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సప్లమ్ ఉన్నచోట పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉంటున్నారు. రెండు, మూడు రోజుల్లో అవసరం మేరకు ఇంధన సరఫరా జరగకపోతే మరికొన్ని పెట్రోల్ బంకులు మూత పడే అవకాశం ఉందని తెలుస్తోంది.