జిల్లాలో అంగన్వాడీలకు 'స్మార్ట్' భరోసా
ADB: చిన్నారుల ఆరోగ్యం, గర్భిణుల పోషణ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసేందుకు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 4,000కి పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.