ఉపఎన్నికపై సీఎం రేవంత్ సమీక్ష
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో Dy.CM, అందుబాటులో ఉన్న మంత్రులు, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఉపఎన్నికలో పాటించాల్సిన వ్యూహలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.