'నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు'
SKLM: పలాస మండలం లొత్తూరు గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహ నిర్మాణ పనులను ఏపీ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఎం.జె. బాబు ఇవాళ పరిశీలించారు. పీఎం జనన్ నిధులతో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత లోపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకూడదని, గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.