'లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరుగుతోంది'

మన్యం జిల్లాలో 8 బార్లకు నూతన బార్ పాలసీ ప్రకారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని, ఈ నెల 30న ఓపెన్ కేటగిరీ, గీత కార్మికులకు సంబంధించి కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ అధికారి బి. శ్రీనాథుడు తెలిపారు. కాగా.. ఇప్పటివరకు కేవలం 2 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.