తెనాలిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

తెనాలిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించి శ్రమదానం చేశారు. ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, యంహెచ్ఓ యేసుబాబు పాల్గొని టిడ్కో గ్రహాల వద్ద వ్యర్థాలను తొలగింపజేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్లు ఊడ్చారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.