అక్రమంగా తరలిస్తున్న 28 గేదెల పట్టివేత: ఎస్సై

SKLM: లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో బుధవారం ఉదయం ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్ నుంచి విజయనగరం జిల్లా అలమండ సంతకు అక్రమంగా రెండు వ్యాన్‌లలో తరలిస్తున్న 28 గేదెలను లావేరు పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. లక్ష్మణరావు తెలిపారు.