అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ

అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ

BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో పేదలకు జగనన్న కాలనీలో భాగంగా ఇళ్ల స్థలాలను కేటాయించారు. అప్పట్లో వారికి ఇళ్ల పట్టాలను కూడా ఇచ్చారు. ఆ స్థలాలు బీడు భూములు కావటంతో లబ్ధిదారులు ఎవరు అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ప్రస్తుతం ఆ కాలనీ దట్టమైన చెట్లతో అడవిని తలపిస్తుంది.