చిన్నారికి నామకరణం చేసిన జగన్

చిన్నారికి నామకరణం చేసిన జగన్

AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ చిన్నారికి నామకరణం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గం, నూతక్కి గ్రామానికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టాలని వారు ఆయనను కోరారు. దీంతో జగన్ ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని.. 'మోక్షితా' అని పేరు పెట్టారు.