రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఏవో

NRML: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని ఏవో రాంచందర్ నాయక్ హెచ్చరించారు. నర్సాపూర్(జి )మండలంలోని చాక్‌పల్లి గ్రామంలో శుక్రవారం ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలు కొనాలన్నారు.