నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడు అరెస్ట్
HYD: సోషల్ మీడియాలో మహిళా సెలబ్రిటీలను వేధిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నటి, యాంకర్ అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు నల్గొండకు చెందిన చంటి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాలో అనసూయపై అసభ్యకర పోస్టులతో వేధించడమే ఇందుకు కారణం. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన పర్యవసానాలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.