రాష్ట్రపతి అల్పాహార విందులో పాల్గొన్న ఎంపీ

రాష్ట్రపతి అల్పాహార విందులో పాల్గొన్న ఎంపీ

NLR: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనీ కల్చరల్ సెంట్రల్‌లో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.