పాఠశాలకు వెళ్లే దారి మూసివేత.. రోడ్డుపైనే విద్యార్థులు
KNR: మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు.