నగరిలో ఒక కోటి వ్యయంతో నిర్మించిన రోడ్లు ప్రారంభం
CTR: నగరి నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటన కొనసాగింది. ఉదయం 10 గంటలకు రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన చంద్రప్ప నాయుడు కండ్రిగ నుంచి తిమ్మరాజు కండ్రిగ వరకు, అలాగే వేణుగోపాలపురం నుంచి తిమ్మరాజు కండ్రిగ వరకు సిమెంట్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉదయం 11 గంటలకు నగరి బైపాస్‌లోని SVG ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.