ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం, గోకులపాడు, భీమవరం గ్రామాల్లో బుధవారం అధికారులు ఇంటి పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి పంచాయతీలో శత శాతం ఇంటి పన్నులు వసూళ్లకు ప్రణాళికను రూపొందించాలని పంచాయతీ కార్యదర్శులను డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను పంచాయతీ కార్యదర్శులు పూర్తి చేయాలన్నారు.