'గ్రామీణ క్రీడలు వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం'

SRD: గ్రామీణ క్రీడలు వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే క్రీడా పోటీల కరపత్రాలను క్యాంపు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీన అంబేద్కర్ మైదానంలో గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.