పోలీసుల బందోబస్తు మధ్య సిలిండర్ల పంపిణీ
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు మంగళవారం లబ్ధిదారులకు పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. సిలిండర్లు దొరకక వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో సిలిండర్ల కొరత ఏర్పడడంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి పెరిగింది. మంగళవారం 60 మందికి పంపిణీ చేశారు.