ఆటో బోల్తా.. ఒకరు మృతి

ఆటో బోల్తా.. ఒకరు మృతి

WGL: సంగెం మండలం షాపూర్ వద్ద మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరానికి చెందిన రవి, ఎడ్ల శ్రీధర్, చేరాలు కల్లు సేవించి తిరిగి వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చామకూరి రవి మృతి చెందగా, గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.