VIDEO: ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లును పరిశీలించిన ఎస్సై
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉర్సు జరిగే ఏర్పాట్లను ఎస్సై ఈట సైదులు పరిశీలించారు. ట్రాఫిక్ ఏర్పాట్లను, దుకాణల సముదాయాలు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సై ఈట సైదులు తెలిపారు. నేడు గంధం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.