నగరంలో ఎయిర్ క్వాలిటీ అంతంతే..!

నగరంలో ఎయిర్ క్వాలిటీ అంతంతే..!

HYD: నగరంలో వాయు నాణ్యత పలు చోట్ల అంతంత మాత్రమే ఉంటుంది. 24 గంటల్లో సూక్ష్మ ధూళి కణాల స్థాయి 100 మైక్రోగ్రామ్స్ మించకూడదు. ఖైరతాబాద్ ప్రాంతంలో 102, కొంపల్లిలో 100 మైక్రోగ్రాములు, నాచారంలో 96 సగటున నమోదు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కారణంగా పొల్యూషన్ పెరుగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.