కంగ్టి పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం
SRD: కంగ్టి మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. అప్పటివరకు ఎండతో పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని రావడంతో వర్షం కురిసింది. దీంతో ఇక్కడి ప్రాంతమంతా చల్లబడింది. ఎండ వేడిమికి ఉక్కపోతతో భరించలేకపోతున్న ప్రజలు చిరుజల్లుల వర్షం కురియడంతో ఉపశమనం పొందారు.